ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై కూచాడి శ్రీహరి రావు కీలక సూచనలు

కలం, నిర్మల్‌: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాలో అర్హులైన ఏ ఒక్కరి పేరు కూడా తొలగిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్మల్‌ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) కోరారు. మంగళవారం సారంగాపూర్‌ మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించిన గ్రామ సభలకు ఆయన హాజరై మాట్లాడారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు, వివరాలలో తప్పులు ఉన్నా, ఇతర సమస్యలు ఎదురైనా సంబంధిత ఆధారాలతో అధికారులను సంప్రదించి సరిచేసుకోవచ్చని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ వివరాలను పరిశీలించుకుని ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు.

ఎస్‌ఐఆర్‌పై విస్తృత అవగాహన కల్పించాలి

బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు ప్రజలకు అందుబాటులో ఉండి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అవగాహన కల్పించాలని శ్రీహరి రావు సూచించారు. బీఎల్‌వోల ద్వారా నోటీసులు అందుకుంటున్న ఓటర్లకు అధికారులు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై విస్తృతంగా వివరించాలని కోరారు. సరైన సమాచారం లేకపోవడం వల్ల అర్హులైన వారి ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, అర్హులైన ప్రతి ఓటరు హక్కును కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>