కలం, మిర్యాలగూడ: ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (MLA Bathula Laxma Reddy) తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల ప్రజా పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మిర్యాలగూడ (Miryalaguda) పట్టణంలోని పార్టీ కార్యాలయం (రాజీవ్ భవన్)లో విజయోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే.. బీఎల్ఆర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం వరుసగా నెరవేరుస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు.
గత 1000 రోజులలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు, రాబోయే రోజుల్లో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ విజయోత్సవ వేడుకల్లో నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల ప్రతినిధులు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

