కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా వరంగల్‌లో (Warangal) కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి ఉచితంగా ఉల్లిగడ్డల (Free Onion) పంపిణీని చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఉచితంగా ఉల్లిగడ్డలు ఇస్తున్నారన్న ఆనందంలో జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పాటు పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. తోపులాటలు జరగడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో చేసేది లేక కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : హైవే బాధితులకు ‘గోల్డెన్’ అభయం.. నకిరేకల్‌లో ‘100 పడకల’ సంజీవని!
Follow Us On : WhatsApp

