ట్రేడ్‌ లైసెన్స్‌ వసూళ్లలో అలసత్వం వద్దు : వెంకన్న

కలం, వరంగల్‌ : ట్రేడ్‌ లైసెన్స్‌ వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి.వెంకన్న (GWMC Commissioner Venkanna) అధికారులను హెచ్చరించారు. శానిటేషన్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో నగర పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

ప్రధాన రహదారుల డివైడర్ల వద్ద మట్టి, చెత్తను తొలగించాలని, స్వీపింగ్‌ యంత్రాల పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని అసెస్‌మెంట్లను గుర్తించి ప్లింత్‌ ఏరియా ప్రకారం ట్రేడ్‌ లైసెన్స్‌ వసూళ్లు చేపట్టాలని, కమర్షియల్‌ సంస్థల నుంచి యూజర్‌ ఛార్జీలు వసూలు చేయాలని సూచించారు. 15 రోజుల్లో పురోగతి కనిపించాలి.. లేకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>