స్థానిక ఎన్నికల్లో పోటీపై కవిత కీలక ప్రకటన

కలం, నిజామాబాద్ బ్యూరో : రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు టీఆర్ఎస్ చీఫ్ కవిత (TRS Chief Kavitha) ప్రకటించారు. నిజామాబాద్ లో జరుగుతున్న పాంచజన్య సంకల్ప సభలో ఆమె తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సామాజిక తెలంగాణ కావాలి.. బహుజన తెలంగాణ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

బీ‌ఆర్‌ఎస్ బంగారు తెలంగాణాలో నలుగురైదుగురు మాత్రమే బంగారం అయ్యారని కవిత ధ్వజమెత్తారు. సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం బయలు దేరుతున్నానని తనను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల్ని వదలబోమని, వెంట పడతామని కవిత హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>