కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రం నుండి పిల్లికొట్టాల వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పాదయాత్ర నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే ( Narsapur MLA), మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వెల్దుర్తి నుంచి మెదక్ కలెక్టరేట్ వరకు పాదయాత్రగా చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా.. ప్రభుత్వం మారిన అనంతరం వాటిని రద్దు చేసి పనులు నిలిపివేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే నిధులు విడుదల చేసి డబుల్ రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

