కలం, నిజామాబాద్ బ్యూరో : రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు టీఆర్ఎస్ చీఫ్ కవిత (TRS Chief Kavitha) ప్రకటించారు. నిజామాబాద్ లో జరుగుతున్న పాంచజన్య సంకల్ప సభలో ఆమె తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సామాజిక తెలంగాణ కావాలి.. బహుజన తెలంగాణ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ బంగారు తెలంగాణాలో నలుగురైదుగురు మాత్రమే బంగారం అయ్యారని కవిత ధ్వజమెత్తారు. సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం బయలు దేరుతున్నానని తనను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకుల్ని వదలబోమని, వెంట పడతామని కవిత హెచ్చరించారు.

