కలం, వెబ్ డెస్క్ : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) కు మాతృవియోగం ఏర్పడింది. ఆయన తల్లి శాంతకుమారి (90) కొద్ది సేపటి క్రితమే కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. రెండు రోజుల నుంచి కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు. దీంతో అన్ని ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలు మోహన్ లాల్ తల్లికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి అంటూ మోహన్ లాల్ కు సానుభూతి తెలియజేస్తున్నారు. తన విజయాల వెనక తల్లి సపోర్టు ఎంతో ఉందని పదేపదే చెప్పేవారు మోహన్ లాల్. ఆమె అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: ఆ హీరో నా కెరీర్ ను మలుపుతిప్పాడు.. అనిల్ రావిపూడి కామెంట్స్
Follow Us On: Instagram


