epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గ్రూప్​ 2 అభ్యర్థులకు బిగ్​ రిలీఫ్​.. రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు డిస్మిస్​

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్​ గ్రూప్​ 2 అభ్యర్థులకు హైకోర్టు (AP High Court) బిగ్​ రిలీఫ్ ఇచ్చింది. గ్రూప్​ 2 (APPSC Group 2) సర్వీసెస్​ రిజర్వేషన్ల మీద దాఖలైన పిటిషన్లను డిస్మిస్​ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్​ లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక రోస్టర్​ పాయింట్లపై 2023లో దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు మంగళవారం విచారించింది. ఈ మేరకు పిటిషన్లను రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.

నోటిఫికేషన్​ లో హారిజాంటల్​ రిజర్వేషన్​ పాయింట్లు కేటాయించడం చట్టవిరుద్ధమంటూ నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. 2025 ఫిబ్రవరి 20న జస్టిస్​ సత్తి సుబ్బారెడ్డి పిటిషన్లు కొట్టివేశారు. పరీక్ష ఫెడ్యూల్​ ప్రకారమే జరగవచ్చని, ఫలితాలు మాత్రం పెండిగ్​ లో ఉన్న ప్రధాన పిటిషన్ల తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మరోసారి ఆ అనుబంధ పిటిషన్లపై నేడు విచార చేపట్టిన హైకోర్టు (AP High Court) వాటిని కోట్టివేస్తూ ఆదేశాలు జారిచేసింది.

Read Also: ఏపీలో 28 జిల్లాలు.. 82 రెవెన్యూ డివిజన్లు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>