కలం, వెబ్ డెస్క్: అందాల రాశీ ఖన్నా (Raashii Khanna) ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. పదకొండేళ్లుగా సినిమాల్లో నటిస్తూనే ఉంది కానీ.. ఎందుకనో ఈ అమ్మడుకు ఆశించిన రేంజ్ లో సరైన బ్రేక్ రాలేదనే చెప్పచ్చు. ఈ సంవత్సరం ‘తెలుసు కదా‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఆడలేదు. హిందీలో 120 బహుద్దూర్ మూవీలో నటించింది. ఆ సినిమా కూడా ఆడలేదు. అలాగే తమిళ్‌లో ఓ సినిమాలో నటిస్తే.. అది కూడా అంతే ఫ్లాప్ అయ్యింది. ఇలా మూడు భాషల్లో మూడు సినిమాలు చేస్తే ఫ్లాప్ అయ్యాయి. అందుకనే అనుకుంటా ఇప్పుడు ఈ అమ్మడు స్పెషల్ సాంగ్‌కు సై అంది.
ఇంతకీ ఏ సినిమాలో ఐటం సాంగ్ చేస్తుందంటే.. అనగనగా ఒక రాజు సినిమాలో. నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా నటించిన అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతికి థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈ మూవీ సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్నారు మేకర్స్. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయిక. అయితే.. ఈ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్ కోసం రాశీ ఖన్నాతో ఐటం సాంగ్ చేయిస్తున్నారట. ఈ మూవీ ప్రమోషన్స్ లో దూసుకెళుతుంది. త్వరలో ఈ సాంగ్ గురించి అప్ డేట్ ఇవ్వనున్నారని తెలిసింది.
2025 రాశీకీ (Raashii Khanna) ఏమాత్రం బాలేదు. అయితే.. 2026లో అనగనగా ఒక రాజు సినిమాలో ఐటం సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో రానుంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. అలాగే హిందీలో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మొత్తానికి రాశీకి 2026 బాగుండేట్టు ఉంది. మరి.. రాశీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.
Read Also: బండ్లన్న మళ్లీ వచ్చాడు.. ఈసారి తన పేరుపైనే కొత్త బ్యానర్
Follow Us On: Pinterest


