కలం డెస్క్ : హరీశ్‌రావు ఎప్పటికపైనా తెలంగాణ చంద్రబాబులాంటి వ్యక్తేనని కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆరోపించారు. పార్టీకి ద్రోహం చేసి కబ్జా చేస్తారనే అనుమానాలు కార్యకర్తల్లో ఉన్నాయన్నారు. అందుకే చాలా మంది బీఆర్ఎస్ కేడర్ ఆయనను తెలంగాణ చంద్రబాబుతో పోలుస్తారని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయం నుంచీ హరీశ్‌రావు గురించి తనకు చాలా విషయాలు తెలుసన్నారు. పార్టీలో ప్రతీ కార్యకర్తకు ఆయన గురించి తెలుసన్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో తనను ఎవరు ఓడించారో, ఎందుకు ఓడించారో అనేక అనుమానాలు ఉన్నాయని కవిత (Kavitha) వెల్లడించారు. రాజకీయ ఓనమాలు తాను తండ్రి నుంచే నేర్చుకున్నానని, ఆయన పట్ల తనకు అపారమైన గౌరవం ఉన్నదన్నారు. ఆ తర్వాత తన భర్త సహకారం ఉందన్నారు. కానీ తన కళ్ళ ముందే అనేక అవమానాలు జరుగుతూ ఉంటే, ఆత్మగౌరవం పోతూ ఉంటే తట్టుకోవడం కష్టమేనని అన్నారు. కేసులు, అరెస్టుల్లాంటివన్నీ జరిగినప్పుడు ఎవరు ఎలా ప్రవర్తించారో బాగా గుర్తుకున్నదని పేర్కొన్నారు.
Read Also: కేటీఆర్ భార్య ఫోన్ ట్యాపింగ్‌పై కవిత సంచలన కామెంట్
Follow Us On: Pinterest


