జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) జనం బాట పట్టడానికి సిద్ధమయ్యారు. తెలంగాణలోని అన్ని జిల్లాలను టచ్ చేస్తూ యాత్ర చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఆమె ‘జాగృతి జనం బాట(Jagruthi Janam Bata)’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌పై కేసీఆర్ ఫొటో లేకపోవడంపై ఆమె వివరణ ఇచ్చారు. కేసీఆర్.. ఒక పార్టీకి అధ్యక్షుడని, తానను ఆ పార్టీ సస్పెండ్ చేసిందని, ఇలాంటి సమయంలో ఈ పోస్టర్‌పై కేసీఆర్ ఫొటో పెట్టడం నైతికంగా సరైనది కాదని వివరించారు.
అందుకే కేసీఆర్ ఫొటో లేకుండానే యాత్రకు సన్నద్ధమయ్యానని పేర్కొన్నారు. అంతేకాకుండా తన గురువులు ప్రజలేనని, వారి దగ్గరకు వెళ్లాలన్న ఆలోచనతోనే యాత్ర ప్రారంభించానని కూడా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో ఏ వర్గం ప్రజలు కూడా సానుకూలంగా లేరని, ప్రతి ఒక్కరిలో వ్యతిరేకత ఉందని అన్నారు. తన యాత్ర నాలుగు వారాలు సాగుతుందని, అందులో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిపై పోరాడటానికి జాగృతి సిద్ధమవుతోందని Kavitha వెల్లడించారు.
Read Also: బీజేపీకి జూబ్లీహిల్స్ అభ్యర్థి ఖరారు

