కలం, వెబ్ డెస్క్: కొద్ది గంటల్లో 2025 ఇయర్ ముగియనుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (New Year Celebrations) కోసం చాలామంది నేటినుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెస్టారెంట్లు, హోటళ్ళు, క్లబ్బులు, పబ్బుల్లో ప్రత్యేక పార్టీలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటిపై యువతలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఆనందాల మాటున విషాదాలు చోటుచేసుకుంటాయి. చిన్నపాటి అజాగ్రత్త చర్యలు కూడా ప్రమాదాలకు దారితీస్తాయి. అతిగా మద్యం సేవించడం, డ్రైంక్ అండ్ డ్రైవ్ చేయడం లాంటివి న్యూ ఇయర్ జోష్‌ను దూరం చేస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలు (Girls) జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. అందుకోసం ఏం చేయాలంటే..
ఈ జాగ్రత్తలు మస్ట్
- పార్టీ (Party)లో ఎంతసేపు ఉండాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోండి. వాతావరణానికి అనుగుణంగా దుస్తులు ధరించాలి. అప్పుడే హాయిగా ఉంటారు.
- ఫుడ్, డ్రింక్ విషయంలో అలర్ట్‌గా ఉండాలి. ఖాళీ కడుపుతో పార్టీకి వెళ్లడం లేదా హెవీగా తిని వెళ్లడం కూడా మంచిది కాదు.
- ప్రయాణ సమయంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇంటికి బయలుదేరేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
- ఫోన్ ఛార్జ్ ఫుల్‌గా ఉండాలి. తద్వారా ఇతరులను కనెక్ట్ కావొచ్చు.
- పార్టీకి వెళ్ళే ముందు సొంత వాహనమా లేదా క్యాబ్‌లో వెళుతారా? అనేది నిర్ణయించుకోవాలి.
- పార్టీలో మద్యం తాగితే వాహనం నడపకండి. క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి చేరుకోండి
- పార్టీ నుంచి ఒంటరిగా బయటకు రావొద్దు
ఇంట్లోనే పార్టీ ఏర్పాటుచేసుకుంటే..
- డ్రింక్స్ (Drinks) ప్లాన్ చేసుకుంటే గెస్టులను సొంత కారులో రాకూడదని చెప్పండి.
- గెస్టుల కోసం కారు, డ్రైవర్ అందుబాటులో ఉంచడి.
- పిల్లలను పార్టీలో ఇన్వాల్వ్ చేయకూడదు.
- పార్టీ ముగించడానికి ఒక గంట ముందు మద్యం తాగొద్దు.
- గ్యాస్, విద్యుత్ ఉపకరణాలు, కొవ్వొత్తులు, లైట్లను జాగ్రత్తగా వాడండి.
- పార్టీ(New Year Celebrations) ప్రాంతంలో తగినంత వెంటిలేషన్ ఉండాలి.
- తల తిరగడం, వాంతులు, తలనొప్పి లేదా కడుపు నొప్పి వంటి సమస్యలకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోండి.
Read Also: గంభీర్ కోచింగ్‌పై పెనేసర్ షాకింగ్ కామెంట్స్
Follow Us On: Instagram


