కలం, వెబ్ డెస్క్ : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తన కోచింగ్ స్టైల్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వైట్ బాల్ క్రికెట్ (టీ20, వన్డే)లో టీమిండియా ఓటమి తెలియని జట్టుగా నిలిచినా, టెస్ట్ క్రికెట్‌కు వచ్చేసరికి మాత్రం అసలు ఆట తెలియని జట్టులా మారింది. 2025లో రెండు సిరీస్‌లలో భారత్ వైట్‌వాష్‌కు గురికావడమే ఇందుకు నిదర్శనం.
ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్.. వ్యూహాలపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కోచ్‌గా గంభీర్‌ను తొలగించాలన్న డిమాండ్‌లు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ (Monty Panesar).. గంభీర్ కోచింగ్ స్టైల్, వ్యూహాలపై ఘాటు వ్యాఖ్యలు చరేశారు. టెస్ట్ క్రికెట్ వ్యూహాలపై గంభీర్‌కు పట్టు లేదని అన్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో గంభీర్ కోచ్‌గా విజయవంతమని పనేసర్ అంగీకరించగా, టెస్ట్ ఫార్మాట్‌లో ఆయనకు అనుభవం, అవగాహన లోపిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
“గౌతమ్ గంభీర్(Gautam Gambhir) వైట్ బాల్ క్రికెట్‌లో విజయాలు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కానీ టెస్ట్ క్రికెట్ పూర్తిగా భిన్నం. ముందుగా రంజీ టీమ్‌లకు కోచింగ్ ఇచ్చి అనుభవాన్ని పెంచుకోవాలి. దేశీయ కోచ్‌లతో కలిసి పనిచేస్తేనే రెడ్ బాల్ క్రికెట్‌లో జట్టును బలోపేతం చేయగలడు” అని పనేసర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, కోచింగ్ వ్యూహాల్లో మార్పులు అవసరమని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
Read Also: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన హంపి, అర్జున్
Follow Us On: X(Twitter)


