కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు ఇజ్రాయెల్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఇజ్రాయెల్ ప్రైజ్’ ప్రకటించింది. శాంతి కేటగిరీలో తొలిసారిగా ఈ అవార్డును అందజేస్తున్నట్లు ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. ఇజ్రాయెల్, యూదుల సంక్షేమం కోసం ట్రంప్ చేసిన కృషికి గుర్తింపుగా దీనిని ఇస్తున్నామని, 80 ఏళ్లలో విదేశీయుడికి ఈ పురస్కారం దక్కడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనపై ట్రంప్ స్పందిస్తూ.. తనకు ఈ అవార్డు రావడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Netanyahu) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారమైన ఇజ్రాయెల్ ప్రైజ్ (Israel Prize) ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 29న ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసమైన మార్-ఎ-లాగోలో జరిగిన ద్వైపాక్షిక సమావేశం తర్వాత నెతన్యాహు ఈ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ విద్యాశాఖ మంత్రి యోవ్ కిస్చ్ ఫోన్ ద్వారా ట్రంప్‌కు ఈ నిర్ణయాన్ని అధికారికంగా తెలిపారు. అవార్డు ప్రదానోత్సవం ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌లో జరగనుంది. ట్రంప్ ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది.
Read Also: తెలంగాణలో క్రైమ్ రేట్ తగ్గింది: డీజీపీ శివధర్ రెడ్డి
Follow Us On: Youtube


