కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ జావెలిన్ త్రో స్టార్ అర్షద్ నదీమ్ (Arshad Nadeem) కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక గుర్తింపు లభించింది. వరల్డ్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో ‘మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ స్పోర్ట్స్ అవార్డు’ (గ్లోబల్ బ్రేక్‌థ్రూ అథ్లెట్)ను అర్షద్‌కు ప్రదానం చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో 92.97 మీటర్ల రికార్డు త్రోతో స్వర్ణ పతకం సాధించిన నదీమ్, 40 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు ఒలింపిక్ గోల్డ్ తెచ్చిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.
అవార్డు స్వీకరించిన అనంతరం నదీమ్, ఈ గౌరవం తనకే కాకుండా పాకిస్థాన్ క్రీడా భవిష్యత్తుకు కూడా ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆతిథ్యం ఇచ్చిన దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్‌కు ధన్యవాదాలు తెలుపారు. ప్రపంచ వేదికపై పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని తెలిపారు. అత్యుత్తమ క్రీడా ప్రతిభను గౌరవించే ఈ అంతర్జాతీయ అవార్డు, అర్షద్ నదీమ్ (Arshad Nadeem)ను మరోసారి గ్లోబల్ స్పోర్ట్స్ మ్యాప్‌పై ప్రత్యేకంగా నిలబెట్టింది.
Read Also: జాయింట్ చెక్ పవర్‌తో చిక్కులెన్నో..
Follow Us On: Instagram


