కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad) నాచారంలో దారుణం చోటుచేసుకుంది. బంగారం (Gold) కోసం ఇంటి యజమానిని చంపేసిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ – మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో సుజాత(65) అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది. కోనసీమ జిల్లా పేరవలి మండలం కొత్తపల్లికి చెందిన ఎం.అంజిబాబు (33) అనే క్యాబ్ డ్రైవర్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. బంగారం కోసం ఇంటి యజమానురాలిని హత్య చేశారు. అనంతరం గోదావరిలో పడేశారు. ఈ నెల 24న సోదరి ఇంటికొచ్చి చూడగా, సుజాత కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంజిబాబు కూడా కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో బంగారం కోసం మహిళను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన స్నేహితులు యువరాజు(18), దుర్గారావు(35)ల సాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో పడేశానని నేరం అంగీకరించాడు. హత్యకు పాల్పడిన అంజిబాబుతో పాటు, సహకరించిన స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: మణుగూరు బస్టాండ్ కు మోక్షం ఎప్పుడో?
Follow Us On: Pinterest


