epaper
Tuesday, November 18, 2025
epaper

బాత్రూమ్‌లో మొబైల్ వాడితే పైల్స్ వస్తాయా..?

Toilet Habits | మొబైల్స్ ఇవి ఒక పరికరం స్థానం నుంచి మన శరీరంలో భాగంగా మారిపోయాయి. ఎవరిని చూసినా చేతిలో మొబైల్‌తోనే కనిపిస్తున్నారు. అన్నం తినేటప్పుడు, పడుకోవడానికి నిమిషాల ముందు ఏం చేస్తున్నా మొబైల్ చేతిలో ఉండాల్సిందే. అంతెందుకు చాలా మంది బాత్రూమ్‌కు వెళ్లే సమయంలో కూడా మొబైల్ ఫోన్ తీసుకెళ్తారు. అందులోనూ జియో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ ధరకే డేటాను అందించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక స్మార్ట్ ఫోన్ వినియోగం తారాస్థాయికి చేరింది. బాత్రూమ్‌లోకి మొబైల్(Mobile Phone) తీసుకెళ్లే అలవాటు పెరిగింది. అయితే ఈ అలవాటు పైల్స్‌(Piles)కు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. అసలు మొబైల్‌ను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లడానికి, పైల్స్ రావడానికి కారణం ఏంటో తెలుసా..

Toilet Habits | ఇప్పుడున్న జనరేషన్‌కు చేతిలో ఫోన్ లేకపోతే ఏ పనీ చేయలేరు. దానిని వాడకపోయినా అది చేతిలోనో జేబులోనే ఉండాల్సిందే. ఆఖరికి బాత్రూమ్‌లోకి కూడా. ఈ అలవాటు అనారోగ్యానికి గురిచేస్తుంది. టాయిలెట్ నుంచి ప్రతి ఒక్కరూ చెడు బ్యాక్టేరియాను ఇంట్లోకి తీసుకొస్తారని నిపుణులు చెప్తున్నారు. ఆ బ్యాక్టీరియా అనేక అనారోగ్యాలకు దారితీస్తుందంటున్నారు. గతంలో పెద్దవారిలో మాత్రమే కనిపించే పైల్స్(మొలలు) సమస్య ఇప్పుడు ఈ యువకులకు కూడా మొదలైందని, అందుకు బాత్రూమ్‌లోకి మొబైల్ తీసుకెళ్లడం కూడా ఒక కారణమని అంటున్నారు నిపుణులు. బాత్రూమ్‌లోకి ఫోన్ తీసుకెళ్లినప్పుడు.. మన శ్రద్ధ మొత్తం ఫోన్‌పైనే ఉంటుంది. దానివల్ల బాత్రూమ్‌లో సాధారణ సమయం కన్నా ఎక్కువసేపు ఉంటారు. అలా చేయడం ద్వారా పైల్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఫోన్ వాడుతూ బాత్రూమ్‌లో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల.. మల సిరల(నరాలు)పై ఒత్తిడి పెరుగుతుందని, అది వాపుకు కారణమైన కాలక్రమేనా పైల్స్‌కు కారణం అవుతునంది పలు అధ్యయనాలు కూడా చెప్తున్నారు.

Read Also: బీపీడీతో జాగ్రత్త.. దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా..?

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>