కలం, వెబ్ డెస్క్ : పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రుల ఒత్తిడి చేయడంతో ఓ సీరియల్ నటి బలవన్మరణానికి పాల్పడింది. కన్నడ, తమిల్ సీరియల్ నటి నందిని (Serial Actress Nandhini) బెంగళూరులోని తన నివాసంలో నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ లో తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని.. దానికి మానసికంగా సిద్దంగా లేనని పేర్కొంది. అలాగే, ఇతర సమస్యల కారణంగా డిప్రెషన్ తో బాధపడుతున్నట్టు రాసుకొచ్చింది.
కాగా, నందిని మరణంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. తమిళ, కన్నడ సీరియల్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిని ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతి అని సమాచారం. తమిళ సీరియల్ అయిన గౌరి సీరియ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కన్నడలో జీవా హౌవాగిడే, సంఘర్ష, మధుమగలు లాంటి సీరియల్స్ లో ముఖ్యమైన పాత్రల్లో Serial Actress Nandhini యాక్ట్ చేసింది.


