epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బంగ్లాదేశ్​ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి బరిలోకి తారిఖ్​

కలం, వెబ్​డెస్క్​: దాదాపు 17 ఏళ్ల తర్వాత స్వదేశంలో అడుగుపెట్టిన బంగ్లాదేశ్​ నేషనలిస్ట్​ పార్టీ(బీఎన్​పీ) తాత్కాలిక అధినేత, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్​ రహ్మాన్ (Tarique Rahman )​ ఎన్నికల బరిలో నిలిచారు. బంగ్లా సార్వత్రిక ఎన్నికల్లో (Bangladesh elections) ఢాకా–17, బోగ్రా–6 నియోజకవర్గాల నుంచి పోటీకి ఆయన తరఫున ప్రతినిధులు సోమవారం నామినేషన్​ దాఖలు చేశారు. బంగ్లాదేశ్​లో ఎన్నికలు ఫిబ్రవరి 12న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తారిఖ్​ పోటీ చేసేందుకు వీలుగా ఆయన్ను ఓటర్ల జాబితాలోకి చేర్చేందుకు ఎన్నికల కమిషన్​ ఆమోదం తెలిపింది. కాగా, ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా పదవీచ్యుత మాజీ ప్రధానికి చెందిన అవామీ లీగ్​ పార్టీపై నిషేధం వేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భారత వ్యతిరేకత, ఉస్మాన్​ హాది హత్య కీలకం కానున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం దాదాపు ఐదు ఇళ్లను అల్లరి మూకలు తగలబెట్టాయి. రాజధాని ఢాకాలో ఇంక్విలాబ్​ మాంఛో కార్యకర్తలు భారత వ్యతిరేక నిరసనలు, ఆందోళనలు, నినాదాలు కొనసాగించారు. బంగ్లాదేశ్​లో ఉంటున్న భారతీయుల వర్క్​ పర్మిట్లు రద్దు చేయాలని, ఉస్మాన్​ హాది హంతకులను, షేక్​ హసీనాను భారత్​ వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్​ చేశారు. హసీనా అప్పగింత కోసం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని మహమ్మద్​ యూనస్​ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానికి అల్టిమేటమ్​ జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>