epaper
Monday, March 2, 2026
epaper

ది రాజాసాబ్ ట్రైలర్ కు 18M వ్యూస్.. టీమ్ స్పెషల్ ట్వీట్

కలం, వెబ్ డెస్క్ : ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ (The Raja Saab) ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని మూవీ టీమ్ చెబుతోంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను కొన్ని గంటల క్రితమే రిలీజ్ చేశారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ది రాజాసాబ్ (The Raja Saab) ట్రైలర్ కు అన్ని డిజిటిల్ ప్లాట్ ఫామ్ లలో కలిపి 18 మిలియన్ల వ్యూస్ వచ్చాయని మూవీ టీమ్ చెప్పింది. ఈ మేరకు స్పెషల్ ట్వీట్ చేసింది. ఇందులో స్పెషల్ వీడియోను కూడా పంచుకున్నారు. ట్రైలర్ లోని కొన్ని సీన్లతో ఈ వీడియోను డిజైన్ చేశారు. ట్రైలర్ విజువల్ ఫీస్ట్ లా ఉందని కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాకుండా ట్రైలర్ లో వీఎఫ్ ఎక్స్ చాలా బాగా సెట్ అయిందని పోస్టులు పెడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!