కలం, వెబ్‌డెస్క్: భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాలకు సంబంధించి రూ.79కోట్ల విలువైన రక్షణ కొనుగోళ్లకు రక్షణ కొనుగోళ్ల మండలి(డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్–డీఏసీ) అంగీకార పత్రం (యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ–ఏవోఎన్) మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన సమావేశమైన డీఏసీ ఆమోదించింది. భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనకు అవసరమైన రాడార్లు, రేడియోలు, ఆటోమేటిక్ టేకాఫ్–ల్యాండింగ్ రికార్డింగ్ సిస్టమ్స్, క్షిపణులు, సబ్మెరైన్ల బెర్తింగ్, అనువైన హార్బర్లు, అస్త్ర ఎంకే–2 మిస్సైల్స్, దీర్ఘశ్రేణి గైడెడ్ కిట్స్, తదితర పరికరాలకు సంబంధించినవి ఈ రక్షణ కొనుగోళ్ళలో ఉన్నాయి. ప్రస్తుతం భూ, వాయు, సముద్ర మార్గాల్లో అనేక కొత్త సమస్యలు ఎదురవుతున్నందున, వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే దళాల ఆధునికీకరణ, ఆపరేషన్‌కు సంసిద్ధత వంటివి మరింత మెరుగుపర్చాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం రూ.79 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులకు ఈ ఏవోఎన్కు ఆమోదం తెలిపినట్లు సమాచారం.


