కలం, వెబ్ డెస్క్ : ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ (The Raja Saab) ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని మూవీ టీమ్ చెబుతోంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను కొన్ని గంటల క్రితమే రిలీజ్ చేశారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ది రాజాసాబ్ (The Raja Saab) ట్రైలర్ కు అన్ని డిజిటిల్ ప్లాట్ ఫామ్ లలో కలిపి 18 మిలియన్ల వ్యూస్ వచ్చాయని మూవీ టీమ్ చెప్పింది. ఈ మేరకు స్పెషల్ ట్వీట్ చేసింది. ఇందులో స్పెషల్ వీడియోను కూడా పంచుకున్నారు. ట్రైలర్ లోని కొన్ని సీన్లతో ఈ వీడియోను డిజైన్ చేశారు. ట్రైలర్ విజువల్ ఫీస్ట్ లా ఉందని కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాకుండా ట్రైలర్ లో వీఎఫ్ ఎక్స్ చాలా బాగా సెట్ అయిందని పోస్టులు పెడుతున్నారు.


