కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ జాడ ఎక్కడ..?

కలం, క్రైమ్ బ్యూరో: తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మాజీ ఓఎస్డీ నార్ల సుమంత్ (Narla Sumanth) కేసులో అరెస్టుల‌ పర్వం కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే సుమంత్ వ్యక్తిగత డ్రైవర్‎ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఏ3 అరుణ్ కుమార్, ఏ4 కార్తీక్, ఏ5 మహేందర్ రెడ్డిలను ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని మార్టూరులో అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. హరికృష్ణా అనే స్థిరాస్తి వ్యాపారిపై దాడి, హత్యాయత్నం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్ ఏ1గా ఉన్నారు. ఘటనపై ఈనెల 20న పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి సుమంత్ జాడ మాత్రం తెలియరాలేదు.

సుమంత్ కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్మాన్‎నగర్ ఓజోన్ హైట్స్ లో ఉంటున్నారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు అక్కడి వెళ్లారు. సుమంత్ లేకపోవడంతో ఆయన డ్రైవర్‎ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమంత్ జాడ మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు. సుమంత్ ఎక్కడ ఉన్నాడు..?? దేశం విడిచి వెళ్లిపోయాడా..?? లేక పోలీసుల అదుపులో ఉన్నాడా..?? హైప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు అరెస్ట్ విషయంలో గోప్యతా పాటిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. వ్యాపారి గొంగడి హరికృష్ణను నిందితులు ఎందుకు టార్గెట్ చేశారు..?? రూ.10 కోట్లు డిమాండ్ చేయడం వెనుక కారణం ఏంటి..?? ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారు.. ఈ వ్యవహారంలో సుమంత్ పాత్ర ఎంతవరకు ఉంది అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>