కలం, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కారుమూరి నాగేశ్వర్ రావు (Karumuri Nageswara Rao)ను నేడు ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 7 వరకు రిమాండ్ కొనసాగనుంది. కోర్టులో విచారణ అనంతరం కారుమూరిని ఈడీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఆదివారం కారుమూరిని అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్ నగదు బదిలీల్లో కారుమూరి ప్రమేయం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కారుమూరి విచారణ అనంతరం ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రానున్నట్లు తెలుస్తోంది.
Also Read : మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌పై ఏసీబీ దాడులు
Follow Us On: X(Twitter)

