బీజేపీ ఎంపీపై నిరంతర నిఘా.. సంచలన ఆరోపణలు

కలం, వెబ్ డెస్క్: తన ఇంటిపై పోలీసులు నిరంతరం నిఘా పెడుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘డీజీపీ సీవీ.ఆనంద్‌తో నాకు దశాబ్ధాలుగా పరిచయం ఉంది. ఆయన సమర్థవంతమైన అధికారిగా చెబుతుంటాను.

తెలంగాణ పోలీస్ శాఖ రాజ్యాంగం ప్రకారమే పని చేస్తుందా..? లేకపోతే సీఎం కుటుంబ సభ్యుల ఆదేశాల మేరకు నడుచుకుంటుందా..? అనే అనుమానం కలుగుతోంది. ఏసీపీ ర్యాంక్ అధికారిని నిరంతరం నాపై నిఘా ఉంచేందుకు నియమించినట్లు తెలిసింది. నా కదలికలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడే సదరు పోలీస్ అధికారికి ఈ పని అప్పగించినట్లు సమాచారం వచ్చింది. తెలంగాణ పోలీసులు చట్టానికి జవాబుదారీగా ఉండాలి తప్ప, ఒక రాజకీయ కుటుంబానికి కాదు’ అని అర్వింద్ (Dharmapuri Arvind) స్పష్టం చేశారు.

Also Read : తెలంగాణ ప్రభుత్వానికి బీజేపీ అధ్యక్షుడి​ వార్నింగ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>