కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా.. అధికారులు తరచుగా తనిఖీలు చేస్తున్నా.. హాస్టల్ విద్యార్థులు నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు. వంట మనుషులు, ఇతర సిబ్బంది ఉన్నా.. విద్యార్థుల చేత పనులు చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా దామరచర్ల (Damercherla) సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థుల చేతే చపాతీలు చేయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభుత్వం వంట మనుషులకు జీతాలు చెల్లిస్తున్నా.. విద్యార్థులతో వంట పనులు చేయించడంపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో వంట పనులు చేయించడం పట్ల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులతో చపాతీలు చేయిస్తున్న ప్రిన్సిపాల్, వార్డెన్లు!
-నల్గొండ జిల్లా దామరచర్ల సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులతో పనులు
-విద్యార్థులతో చపాతీలు చేయిస్తున్న ప్రిన్సిపాల్, వార్డెన్లు?
-వంట మనుషులకు ప్రభుత్వం నెలకు జీతాలు చెల్లిస్తున్నప్పటికీ, విద్యార్థులతో ఇలా పనులు… pic.twitter.com/xCdQxcBJo3— Kalam Daily (@kalamtelugu) August 24, 2026

