epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

విజయ్ ​హజారే.. ఆంధ్ర, హైదరాబాద్​ ఓటమి

కలం, వెబ్​డెస్క్​: విజయ్​ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో తెలుగు జట్లకు మరో ఓటమి ఎదురైంది. సోమవారం జరిగిన మ్యాచ్​ల్లో ఆంధ్ర, హైదరాబాద్​ పరాజయం పాలయ్యాయి. గ్రూప్​–డిలో భాగంగా బెంగుళూరులో ఒడిశాతో జరిగిన మ్యాచ్​లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన ఆంధ్ర 49.2 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. ఎస్​డీఎన్​వీ ప్రసాద్​(66; 64 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్​లు) అర్ధ సెంచరీ చేయగా, చివర్లో సౌరభ్​ కుమార్​ (47; 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్​లు) మెరుపులు మెరిపించాడు. కెప్టెన్​ నితీశ్​ కుమార్​ రెడ్డి (6) నిరాశపర్చాడు. ఒడిశా బౌలర్లలో గోవింద పొద్దర్​, బిప్లబ్​ సమంత్​రాయ్​ చెరో 3 వికెట్లు పడగొట్టారు. లక్ష్యాన్ని ఒడిశా 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్​ ఓమ్​ టి ముండే (91), గోవింద పొద్దర్​(89) అర్ధసెంచరీలతో తమ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు 2 వికెట్లు తీయగా, నితీశ్​, హేమంత్​ చెరో వికెట్​ పడగొట్టారు. ఇది ఆంధ్రకు మూడు మ్యాచ్​ల్లో రెండో ఓటమి.

వరుసగా మూడో పరాజయం..:

గ్రూప్​–బిలో భాగంగా రాజ్​కోట్​ వేదికగా అస్సాంతో జరిగిన మ్యాచ్​లో హైదరాబాద్​ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్​ చేసిన హైదరాబాద్​ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. రాహుల్​ సింగ్​(79; 71 బంతుల్లో 14 ఫోర్లు), అభిరత్​ రెడ్డి (54; 66 బంతుల్లో 6 ఫోర్లు), నితీశ్​ రెడ్డి (53; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్​లు) అర్ధసెంచరీలతో రాణించారు. అస్సాం బౌలర్లలో అబ్దుల్​ అజీజ్​ 3, స్వరూపమ్​ పుర్కాయస్థ, శిబ్​శంకర్​ రాయ్​ చెరో 2 వికెట్లు తీశారు. శిబ్​శంకర్​ రాయ్​(112; 109 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్​) సెంచరీకి తోడు సౌరవ్​ దిహింగియా (91), డేనిష్​ దాస్​(54) అర్ధసెంచరీలు చేయడంతో లక్ష్యాన్ని అస్సాం 6 వికెట్లు కోల్పోయి, మరో 3 బంతులు ఉండగా అందుకుంది. హైదరాబాద్​ బౌలర్లలో సీవీ మిలింద్ 3, వరుణ్​ గౌడ్​ 1 వికెట్ తీశారు. ఇది టోర్నీ (Vijay Hazare Trophy) లో హైదరాబాద్​కు వరుసగా మూడో పరాజయం. ​

Read Also: అదరగొట్టిన అభిషేక్.. 60 నిమిషాల్లో 45 సిక్సర్లు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>