కలం, వెబ్ డెస్క్ : ఉన్నావ్ కేసు (Unnao Case)లో కుల్దీప్ సింగ్ సెంగర్ కు సుప్రీంకోర్టులో షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా ఉన్నావ్ కేసు బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ కేసులో కుల్దీప్ సెంగర్ కు మరణశిక్ష పడేదాకా పోరాడుతా. అప్పుడే నా తండ్రి మరణానికి న్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టు మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నా. నా లాంటి ఎంతో మంది బాధిత అమ్మాయిలకు మన చట్టాలు అండగా ఉండాలి’ అంటూ తెలిపారు.
2017లో ఉన్నావ్ (Unnao Case) కు చెందిన మైనర్ బాలికను అప్పటి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ సెంగర్ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతని అనుచరులు ముగ్గురు ఆ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. దీంతో ఆ బాలిక సీఎం యోగి(CM Yogi) ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేయడం అప్పట్లో సంచలనం రేపింది. అప్పటి నుంచి ఈ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాలిక తండ్రిని కస్టడీలో చంపేశారు. బాలిక కోర్టుకు వస్తున్న టైమ్ లో కుల్దీప్ యాక్సిడెంట్ చేయించగా.. అందులో బాధితురాలి అత్త, పిన్ని, న్యాయవాది చనిపోయారు. బాలిక తీవ్రంగా గాయపడి ఆరు నెలలు వెంటిలేటర్ మీద పోరాడి బతికింది. ఈ కేసుల్లో కుల్దీప్ దోషిగా తేలాడు. అత్యాచార కేసులో జీవిత ఖైదు విధించగా.. కస్టడీలో బాలిక తండ్రిని చంపిన కేసులో పదేళ్ల జైలుశిక్ష పడింది. రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టు అత్యాచార కేసులో బెయిల్ ఇవ్వగా.. సీబీఐ సుప్రీంకోర్టులో (Supreme Court) సవాల్ చేసింది. దీంతో నేడు సుప్రీంకోర్టు ఆ బెయిల్ ఆర్డర్ పై స్టే విధించింది.
Read Also: రామాయణం, భగవద్గీత చెప్తా.. అన్వేష్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: Instagram


