కలం, కరీంనగర్/మెదక్ బ్యూరో: సిద్ధిపేట (Siddipet) జిల్లా హుస్నాబాద్ (Husnabad) పట్టణంలో నిర్మితమవుతున్న 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, పనుల నాణ్యత, వేగం, నిర్మాణ ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఆసుపత్రి నిర్మాణ పనులను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న 250 పడకల ఆసుపత్రి భవనం పూర్తయితే ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు మరింత చేరువ కానున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిర్మాణ పనుల సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి, ఆసుపత్రి భవన నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

