మేఘన కేసు.. వైరల్ వీడియోలపై జోగి రమేశ్ రియాక్షన్

కలం, వెబ్ డెస్క్: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ (Jogi Ramesh) తన కుమారుడు జోగి రాజీవ్ వివాహం చుట్టూ నెలకొన్న వివాదంపై స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన కోడలు మేఘనను తమ సొంత కుమార్తెలాగే చూసుకున్నామని ఆయన తెలిపారు. తమపై కేసు పెట్టిన మేఘనకు కూడా.. తాము ఆమెను ఎలా చూసుకున్నామో తెలుసని అన్నారు. తన కుమారుడిపై మేఘన చేసిన ఆరోపణలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు మొత్తం ఫేక్ అని కొట్టిపారేశారు.

తాము బైబిల్ చదవడం, యేసుక్రీస్తు బోధనలు వినడం తప్పు ఎలా అవుతుందని జోగి రమేశ్ ప్రశ్నించారు. తమ కుటుంబం ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మేఘనను తమ కుటుంబంలో భాగంగానే భావించామని, ఆమెను ఎప్పుడూ సొంత కుమార్తెలాగే చూసుకున్నామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>