కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర (Maharashtra) లోని అమరావతి (Amravati) లో విషాదం చోటుచేసుకుంది. అమరావతి జిల్లా ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం (Amravati Hospital Fire) సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నవజాత శిశువులు మృతిచెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఆస్పత్రిలోని మూడవ అంతస్తులోని NICU లో సోమవారం ఉదయం 3.30 గంటల ప్రాంతంలో వెంటిలేటర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు నిమిషాల్లో వార్డు మొత్తం వ్యాపించగా.. ముగ్గురు శిశువులు మంటల్లో చిక్కుకుని మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్లో చిక్కుకున్న శిశువులను కాపాడారు. ఆరుగురు శిశువులు తీవ్రంగా గాయపడగా వారికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో వార్డులో 39 మంది శిశువులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

