epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

పోలవరం-బనకచర్లపై కేంద్రానికి లేఖ..

పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌(Banakacherla Project) విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఈ ప్రాజెక్ట్‌ను ఆపాలని కోరుతూ కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. ఈ మేరకు అనేక అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు. ఈ విషయంపై గతంలోనే ఫిర్యాదు చేసినట్లు కూడా ఆయన వివరించారు. ‘‘డీపీఆర్ తయారీ కోసం ఏపీ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.

తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే, నిబంధనలు, విభజన చట్టానికి వ్యతిరేకంగా బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌ను కట్టకుండా చూడాలి’’ అని ఆయన తన లేఖలో కోరారు. ఈ విషయంపై కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే లేఖ రాసింది. అయినా ఆశించిన ఫలితం రాలేదు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్(Banakacherla Project) విషయంలో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానిని నివారించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం మరోసారి కేంద్రానికి లేఖ రాసింది.

Read Also: రెడ్డి నాయకులపై కొండా సురేఖ ఆగ్రహం..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>