కలం, వెబ్ డెస్క్: ఛలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక (Rashmika Mandanna). తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్నది. ఆతర్వాత గీత గోవిందం, దేవదాసు, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, సీతారామమ్ తదితర చిత్రాలతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్లోనే కాకుండా.. బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా దూసుకెళుతుంది. ఇంకా చెప్పాలంటే.. రష్మిక ఉంటే.. బొమ్మ బ్లాక్ బస్టరే అనేట్టుగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు 2026ని కొత్తగా ప్లాన్ చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. 2026 రష్మిక ప్లాన్ ఏంటి?
2025లో ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ చేసింది. హిందీలో చావా, సికిందర్, తుమ్మా సినిమాలు రిలీజ్ కాగా తెలుగులో కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు 2026లో పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను సరికొత్తగా ప్లాన్ చేసుకుందని తెలిసింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండను రష్మిక పెళ్లి చేసుకోబోతుంది. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ను త్వరలోనే వస్తుందని సమాచారం.
ఇక కెరీర్ పరంగా చూసుకుంటే.. హిందీలో ఓ సినిమా, తెలుగులో రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈ సినిమాలు నెక్ట్స్ ఇయర్ ఫస్టాఫ్‌లో రిలీజ్ కానున్నాయి. హిందీలో షాహిద్ కపూర్‌కు జంటగా ఓ సినిమాలో నటిస్తుంది. తెలుగులో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తుంది. అలాగే మైసా అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తుంది. ఇటీవల ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. పెళ్లి తర్వాత కూడా నటించనుంది. అయితే.. కొత్త సినిమాలను పెళ్లి తర్వాతే ఒప్పుకుంటుందట. మొత్తానికి 2026ని కొత్తగా ప్లాన్ చేసింది క్రష్మిక(Rashmika Mandanna).
Read Also: ఢిల్లీ హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ థాంక్స్..
Follow Us On: Pinterest


