కలం, వెబ్ డెస్క్: అఖండ 2 సినిమా చూసిన అనంతరం కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎమోషనల్ అయ్యారు. ‘ఇన్ని రోజులు నా జీవితాన్ని, సమయాన్ని వృథా చేసుకున్నాను.. ఇప్పటి నుంచైనా ఈ జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం వినియోగించాలని ఆలోచించే మూవీ అఖండ2(Akhanda 2). చాలా గొప్ప సినిమా‘ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సినిమా చూసిన అనంతరం దర్శకుడు బోయపాటితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. బాలకృష్ణ(Balakrishna) నటన ఎంతో గొప్పగా ఉందని కొనియాడారు. పెద్ద ఎన్టీఆర్ను మైమరిపించేలా బాలకృష్ణ నటించారని ప్రశంసించారు. ‘బాలకృష్ణ సినిమాలు కాలేజ్ స్టూడెంట్స్ బెట్టింగ్ వేసుకొని మరీ చూస్తున్నారు. బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్ను చూసుకుంటున్నాము. అఖండ 2 సినిమాలో బాలకృష్ణను చూస్తే పరమేశ్వరుడే ప్రత్యక్షం అయ్యాడనిపించింది బండి(Bandi Sanjay) ప్రశంసించారు.
Read Also: మంత్రి పొంగులేటి సంస్థపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
Follow Us On: X(Twitter)


