epaper
Monday, March 2, 2026
epaper

‘ఇన్ని రోజులు నా జీవితాన్ని వృథా చేసుకున్నాను‘

కలం, వెబ్ డెస్క్: అఖండ 2 సినిమా చూసిన అనంతరం కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎమోషనల్ అయ్యారు. ‘ఇన్ని రోజులు నా జీవితాన్ని, సమయాన్ని వృథా చేసుకున్నాను.. ఇప్పటి నుంచైనా ఈ జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం వినియోగించాలని ఆలోచించే మూవీ అఖండ2(Akhanda 2). చాలా గొప్ప సినిమా‘ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సినిమా చూసిన అనంతరం దర్శకుడు బోయపాటితో కలిసి బండి సంజయ్  మీడియాతో మాట్లాడారు.

సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. బాలకృష్ణ(Balakrishna) నటన ఎంతో గొప్పగా ఉందని కొనియాడారు. పెద్ద ఎన్టీఆర్‌ను మైమరిపించేలా బాలకృష్ణ నటించారని ప్రశంసించారు. ‘బాలకృష్ణ సినిమాలు కాలేజ్ స్టూడెంట్స్ బెట్టింగ్ వేసుకొని మరీ చూస్తున్నారు. బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్‌ను చూసుకుంటున్నాము. అఖండ 2 సినిమాలో బాలకృష్ణను చూస్తే పరమేశ్వరుడే ప్రత్యక్షం అయ్యాడనిపించింది బండి(Bandi Sanjay) ప్రశంసించారు.

Read Also: మంత్రి పొంగులేటి సంస్థపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!