epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అదొక సిల్లీ నిర్ణయమే అవుతుంది: జో రూట్

కలం, వెబ్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో (Ashes Series) ఇంగ్లండ్ టీమ్ ఘోరంగా ఓడిపోయింది. నాలుగో టెస్ట్‌లో గెలిచినప్పటికీ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ జట్టు మేనేజ్‌మెంట్‌ను మార్చే ఆలోచనలో ఇంగ్లండ్ సెలక్టర్లు ఉన్నట్లు ప్రచారం జరిగింది. కాగా దీనిపై తాజాగా ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ జో రూట్ (Joe Root) దీనిపై స్పందిస్తూ.. మేనేజ్‌మెంట్‌ను మార్చడం వల్ల ఉపయోగం ఏంటని అన్నారు. అదొక సిల్లీ ఆలోచనే అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వ్యవస్థపై ఆటగాళ్లంతా పూర్తిగా నమ్మకంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో పరాజయాలతో ఇంగ్లండ్ కేవలం 11 రోజుల్లోనే అషెస్‌ను కోల్పోయింది. సిద్ధత లోపం, మధ్య సిరీస్ విరామంలో ప్రవర్తనపై విమర్శలు కూడా ఎదురయ్యాయి. అయితే మెల్‌బోర్న్ టెస్టులో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి, ఆస్ట్రేలియాలో 18 మ్యాచ్‌లుగా కొనసాగిన విజయ రాహిత్యానికి ఇంగ్లండ్ ముగింపు పలికింది. ఈ విజయం కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్‌లపై ఉన్న ఒత్తిడిని తగ్గించింది.

“మేమంతా మేనేజ్‌మెంట్‌కు కట్టుబడి ఉన్నాం. జట్టు స్పష్టంగా మెరుగుపడింది. మార్పుల గురించి ఆలోచించడం సరైంది కాదు” అని రూట్ తెలిపారు. సిడ్నీలో జరిగే ఐదో టెస్టులో గెలిస్తే, ఈ వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని జో రూట్(Joe Root) అభిప్రాయపడ్డారు.

Read Also: PSL 11 బ్రాండ్ అంబాసిడర్ ఖరారు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>