కలం, వెబ్ డెస్క్: సోమవారం జరిగిన అసెంబ్లీ శీతకాల సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరైన విషయం తెలిసిందే. కేసీఆర్ రాకతో అసెంబ్లీ వాడీవేడీగా కొనసాగుతుందని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ కేసీఆర్ మాత్రం పట్టుమని పది నిమిషాలైన ఉండకుండా అసెంబ్లీని వీడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎదురుపడ్డారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో ఏం మాట్లాడారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ‘‘మేం ఇద్దరం మాట్లాడుకున్నది మీకెందుకు చెబుతాం, కేసీఆర్ ఎందుకు వెంటనే వెళ్లిపోయారో ఆయన్నే అడగాలి’’ అని సీఎం రేవంత్ సమాధానమిచ్చారు.
‘‘కేసీఆర్‌ను కలవడం ఇది మొదటిసారి కాదు.. రెండోసారి. కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా కలిశాను. నేను, కేసీఆర్ మాట్లాడుకున్న విషయాలు అక్కడే అడగండి. అక్కడ అడగకుండా ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు’’ అని మీడియా ప్రతినిధులను తిరిగి ప్రశ్నించారు రేవంత్ (Revanth Reddy).
‘‘ అసెంబ్లీ లాబీని పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరిగా తీర్చిదిద్దుతాం. మాజీ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులకు యాక్సెస్ కల్పిస్తాం. మాజీ ఎమ్మెల్యేలకు సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. బడ్జెట్ సమావేశాల వరకు మండలిని పూర్తిచేయాలనుకుంటున్నాం’’ అని సీఎం రేవంత్ తెలిపారు. కేసీఆర్ రాక సందర్భంగా బీఆర్ఎస్ (BRS) నాయకులు ఓ రేంజ్‌లో హడావుడి చేశారు. కేసీఆర్ మాత్రం ఇలా వచ్చి.. అలా వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Read Also: కేసీఆర్ అందుకే వెళ్లిపోయారా?
Follow Us On: X(Twitter)


