కలం వెబ్ డెస్క్ : ఏపీ మంత్రివర్గం(AP Cabinet) కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వెలగపూడిలోని సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లా కేంద్రాల మార్పుతో పాటు, పలు కొత్త జిల్లాల(New Districts) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాయచోటి (Rayachoti)లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ మదనపల్లి(Madanapalle)ని అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారుస్తున్నట్లు ప్రకటించింది.
అలాగే రాజంపేటను కడప జిల్లాలో కలపనున్నారు. రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో, గూడూరును నెల్లూరులో కలిపేందుకు ఆమోదం లభించింది. మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. దీంతో ఏపీలో జిల్లాల సంఖ్య 28కి చేరుకుంది. వీటితో పాటు ఐదు నూతన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం (AP Cabinet) ఆమోదం తెలిపింది. వీటిలో నాకపల్లి, అద్దంకి, పీలేరు, బనగానపల్లి, మడకశిర ఉన్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తప్పని పరిస్థితుల్లో మార్పులు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ మార్పులన్నీ ప్రజా ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. మరోవైపు రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగించాలని సోమవారం సైతం ఆందోళనలు కొనసాగాయి.
Read Also: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం
Follow Us On: Youtube


