కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సోమవారం అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కేసీఆర్ సభకు రావడం.. ముఖ్యమంత్రి రేవంత్ ఆయనకు కరచాలనం చేయడం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నాంటూ బీఆర్ఎస్ పార్టీ తెగ ఊదరగొట్టింది. దీంతో ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడబోతున్నారు.. అన్న ఆసక్తి నెలకొన్నది. కానీ కేసీఆర్ మాత్రం చాలా తక్కువ సమయమే అసెంబ్లీలో (Assembly) ఉన్నారు. రిజిస్టర్‌లో సంతకం చేసి నందినగర్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఇక ఈ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ మళ్లీ వస్తారా? లేదా? అన్న చర్చ కూడా సాగుతోంది.
ఇదిలా ఉంటే కేసీఆర్ (KCR) అసెంబ్లీలో ఎక్కువ సేపు ఉండకపోవడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. దళితుడైన స్పీకర్ ఎదుట కూర్చొని మాట్లాడలేకే కేసీఆర్ వెళ్లిపోయారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దళితులంటే కేసీఆర్‌కు చిన్నచూపు అని .. అందుకే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి పక్కన పెట్టేశారని.. గతంలో దళితుడికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి వెంటనే తప్పించారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇప్పుడు ఇదే అంశాన్ని ట్రెండ్ చేస్తోంది. కేసీఆర్ గతంలోనూ పలుమార్లు అసెంబ్లీకి వచ్చినప్పటికీ ఆయన ఏనాడూ ప్రసంగించలేదు. కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకొనేందుకే కేసీఆర్ సభకు హాజరై రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరి కేసీఆర్ వ్యూహం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ విమర్శలను ఆయన ఎలా తిప్పికొడతారు? అన్నది వేచి చూడాలి.
Read Also: ఆ భయంతోనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు : ఆది శ్రీనివాస్
Follow Us On: Sharechat


