కలం వెబ్ డెస్క్ : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) చిన్న కుమారుడు అల్లు శిరీష్(Allu Sirish) త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. అక్టోబర్‌లో అల్లు శిరీష్ తన చిరకాల ప్రేయసి నయనికతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక జరుపుకొన్నారు. ఆ తర్వాత పెళ్లి గురించి మాత్రం సీక్రెట్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ, తాజాగా శిరీష్ ఓ ట్రెండింగ్ రీల్‌తో సోషల్ మీడియాలో తన పెళ్లి తేదీ చెప్పేశాడు.
ఈ వీడియోలో తన అన్న అల్లు అర్జున్ పిల్లలు కూడా ఉన్నారు. ఓ పాటకు క్యూట్‌గా డ్యాన్స్ చేస్తూ అర్హ, మరో అమ్మాయి శిరీష్‌ను పెళ్లి ఎప్పుడు అన్నట్లు అడిగారు. దానికి శిరీష్, అయాన్ 2026 మార్చి 6న అంటూ బదులిచ్చారు. మళ్లీ అర్హ మరి సంగీత్ ఎప్పుడు అని అడిగింది. శిరీష్ (Allu Sirish).. మనం సౌత్ ఇండియన్స్.. మనం సంగీత్ చేసుకోం అని బదులిస్తూ క్యూట్‌గా డ్యాన్స్ చేసేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(viral)గా మారింది. అయితే ఇక్కడ పెళ్లి తేదీలో చాలా స్పెషల్ ఉంది. సరిగ్గా 2011వ సంవత్సరంలో మార్చి 6న తేదీనే అల్లు అర్జున్(Allu Arjun) వివాహం కూడా జరిగింది. అన్నదమ్ములకు ఒకే పెళ్లి రోజు రావడంపై నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. పెళ్లి తేదీ అయితే చెప్పాడు కానీ ఎక్కడ చేసుకుంటున్నారో చెప్పలేదంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read Also: విజయ్‌ని పూర్తిగా మార్చేసిన పూరి
Follow Us On: Pinterest


