కలం, వరంగల్ బ్యూరో : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం(US Road Accident) జరిగింది. ఈ ఘటనలో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మేఘనారాణి, భావన ఉన్నత చదువులు పూర్తి చేసి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా ఉండే తమ స్నేహితులతో కలిసి కారులో విహారయాత్రకు వెళ్లారు. రోడ్డుపై వెళ్తున్న క్రమంలో కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
దీంతో మేఘనారాణి, భావన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మేఘన తండ్రి నాగేశ్వరరావు గార్ల మండలంలో మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. భావన తండ్రి కోటేశ్వర్రావు ముల్కనుర్ ఉప సర్పంచ్‌గా ఉన్నారు. విదేశాల్లో గొప్ప చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేసి తిరిగొస్తారనుకున్న పిల్లలు ఇక ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని కుటుంబసభ్యులు దుఖంలో మునిగిపోయారు.
Read Also: చైనా మాంజా వినియోగిస్తే కఠిన చర్యలు: ఖమ్మం సీపీ
Follow Us On: Youtube


