కలం, వెబ్ డెస్క్: టీ20 2026 వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ (Shubman Gill) ఔట్ అయ్యాడు. గిల్‌ను తొలగించడం తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో పొలిటికల్ కోణం కూడా బయటకు వస్తోంది. పొలిటికల్ ప్రెజర్ వల్లే గిల్‌ను తొలగించారన్న వాదన వినిపిస్తోంది. జట్టులో రింకూ సింగ్‌కు స్థానం కల్పించాలని రాజకీయ ఒత్తిడి పెరిగిందని, దానికి గిల్ బలయ్యాడని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది.
రింకూ సింగ్‌ను ఫినిషర్‌గా ఎంపిక చేయడం వెనుక రాజకీయ జోక్యం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఆయన ఎంపిక కారణంగా జితేష్ శర్మకు చోటు దక్కలేదని, బ్యాకప్ వికెట్‌కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను తీసుకోవడంతో ఓపెనర్ అయిన గిల్‌ను (Shubman Gill) తప్పించాల్సి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో రాజకీయ నేతల ప్రభావం ఉందన్న ఆరోపణలు కూడా చర్చనీయాంశంగా మారాయి.
అయితే గణాంకాల పరంగా చూస్తే రింకూ సింగ్ ఎంపికకు బలం ఉంది. అతడు 35 టీ20 మ్యాచ్‌ల్లో 42.30 సగటు, 161.76 స్ట్రైక్‌రేట్‌తో రాణించగా, గిల్ 36 మ్యాచ్‌ల్లో 28.03 సగటు, 138.59 స్ట్రైక్‌రేట్ మాత్రమే నమోదు చేశాడు.కానీ ప్రతిభ కంటే రాజకీయ ఒత్తిళ్లే గిల్‌పై వేటు పడేలా చేశాయన్న వాదన కొనసాగుతుండటంతో జట్టు ఎంపికపై వివాదం కొనసాగుతోంది.
Read Also: PSL 11 బ్రాండ్ అంబాసిడర్ ఖరారు
Follow Us On: X(Twitter)


