కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ తిరుమల తిరుపతికి వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆయన శ్రీవారిని దర్శించుకోకున్నారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులు కూడా వెళ్ళనున్నారు. మంగళవారం అసెంబ్లీ సెషన్ లేకపోవడంతో తిరుమలకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే రేపటి దర్శనం కోసం సోమవారం రాత్రి రేవంత్ రెడ్డి తిరుమలకు వెళ్తారు. రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకుంటారు. పలువురు మంత్రులు, శాసనసభ్యులు, పార్టీల నేతలు కూడా రేవంత్‌తో పాటు తిరుమలకు వెళ్లనున్నారు. రేవంత్ రాక సందర్భంగా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
Read Also: కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడని హడావిడి ఎందుకు చేస్తున్నారు?: ఆది శ్రీనివాస్
Follow Us On: Youtube


