కలం వెబ్ డెస్క్ : ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్(Ernakulam Express) రైలు అగ్ని ప్రమాదం ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసింది. రైలులో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ప్రమాదం అనంతరం రక్షణ చర్యలు చేపట్టిన అధికారులు పరిస్థితిని చక్కబెట్టే పనిలో పడ్డారు. ఈ క్రమంలో రైలులో భారీగా నగదు ఉండటాన్ని గుర్తించారు. ఈ ఘటనలో విజయవాడకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు చంద్రశేఖర్ సుందర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నగదు మొత్తం ఆయనకు చెందినదిగా అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు ఆయన వద్ద కొంత బంగారం కూడా ఉన్నట్లు గుర్తించారు.
నగదు, బంగారం, మృతుడి పర్స్ ఒకే చోట లభించడంతో అవన్నీ ఆయనకు చెందినవి భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే చంద్రశేఖర్ తన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు మృతుడి కుటుంబానికి రైల్వేశాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి (Ernakulam Express) గల కారణాలు గుర్తించేందుకు విచారణ ప్రారంభించారు.
Read Also: అందుకు ఒప్పుకుంటేనే భారత్‌లో స్టార్‌లింక్ సేవలు!
Follow Us On: Pinterest


