కలం, వెబ్ డెస్క్: కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడని హడావిడి ఎందుకు చేస్తున్నారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas), ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆయన అసెంబ్లీ పాయింట్ వద్ద మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్ష నాయకులు ప్రజల సమస్యల పరిష్కారానికి సూచనలు అందించాని అన్నారు. రాజకీయం కోసం అసెంబ్లీని వేదికగా వాడుకోవద్దని ఆయన అన్నారు.
ప్రతిపక్ష నాయకులు ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించాలన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాక రెండేళ్లు అవుతుందని, ఆయన ఈరోజు అసెంబ్లీకి వస్తున్నాడని హడావిడి చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసమే ప్రజలు కేసీఆర్ (KCR)ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారన్నారు. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ కాలయాపన చేశారని ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) అన్నారు.
Read Also: అసెంబ్లీలో థర్డ్ క్లాస్ భాష మాట్లాడొద్దు: బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి
Follow Us On: Youtube


