epaper
Friday, January 16, 2026
spot_img
epaper

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

క‌లం వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (Telangana Assembly)  ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి సభ సంతాపం తెలిపింది. ఇప్ప‌టికే శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. శాసనసభ శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, సీతక్క వివిధ పేపర్స్ ని సభలో ప్రవేశపెట్టనున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly)  ఉభయ సభలు వాయిదా పడ్డ తర్వాత బీఏసీ సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. శాసనసభ, మండలి ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది. కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుప‌డుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజ‌ర‌వుతుండ‌టం హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి అసెంబ్లీ సమావేశంలో కృష్ణ, గోదావరి నదీ జలాలు, ప్రాజెక్టులపై ప్రధాన చర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల తగ్గింపుపై చర్చించాలని గులాబీ పార్టీ ప‌ట్టుప‌డుతోంది. కృష్ణ, గోదావరి ప్రాజెక్టులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్ర‌భుత్వం భావిస్తోంది. మ‌రోవైపు తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతోంది .

శాసనసభలో డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker) ఎన్నిక జ‌రుగ‌నుంది. ప్ర‌భుత్వం ఇటీవల ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చిన కొన్ని బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. సభను హుందాగా నడుపుకుందామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్ని పక్షాలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ డిసైడ్ అయ్యింది.

Read Also: పొలిటికల్ ప్రెజర్ వల్లే శుబ్‌మన్ గిల్‌కు ఛాన్స్ దక్కలేదా?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>