కలం వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీ(Assembly)కి బయలుదేరారు. అభిమానులు కేసీఆర్ వాహనానికి హారతి ఇచ్చి అసెంబ్లీకి సాగనంపారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. మరికొద్ది సేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: రేవంత్.. ఫోన్ ట్యాపింగ్ చేస్తలేరా? చిట్‌చాట్‌లో కేటీఆర్
Follow Us On: Instagram


