కలం, వెబ్ డెస్క్: రోజురోజుకూ రైలు ప్రమాదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. నిత్యం ఏదో చోట రైలు ప్రమాద ఘటనలు వెలుగుచూస్తున్నాయి. సోమవారం మెక్సికో (Mexico)లో ఘోర రైలు ప్రమాదం ప్రమాదం జరిగింది. పసిఫిక్ సముద్రం-గల్ఫ్ ఆఫ్ మెక్సికోను కలిపే లైన్‌పై ఒక్సాకా-వెరాక్రూజ్ మధ్య ఘటన జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. మరో 98 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో రైలు (Train)లో దాదాపు 250 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఓక్సాకా గవర్నర్ సాలోమన్ జారా క్రజ్ సంతాపం తెలిపారు. రాష్ట్ర అధికారులు, రైల్వేశాఖ సాయంతో బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, తగిన పరిహారం అందిస్తామని తెలిపారు.
Read Also: ‘ఉన్నావ్’ రేప్ కేస్ నిందితుడికి సుప్రీం షాక్
Follow Us On : WhatsApp


