కలం వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Volodymyr Zelensky) ఫ్లోరిడాలోని మార్ ఎ లాగోలో సమావేశమయ్యారు. భేటీకి మూడు గంటల ముందు ట్రంప్ కార్యాలయం నుంచి దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని(Ukraine War)ముగించేందుకు పురోగతి సాధించామని ఇద్దరూ వెల్లడించారు. యుద్ధం ముగింపుపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు ట్రంప్ వెల్లడించారు. 20 అంశాల శాంతి ప్రణాళికలో 90 శాతం ఒప్పందం కుదిరినట్లు తెలిపారు.ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు దాదాపు 95 శాతం పూర్తయ్యాయి. అయితే రష్కా ఆక్రమించిన భూభాగాల సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. వచ్చే వారం అమెరికా,ఉక్రెయిన్ బృందాలు మళ్లీ చర్చలు జరుపనున్నాయి. చర్చలకు ముందు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రెండు వైపులా తాత్కాలిక సీజ్‌ఫైర్‌కు వ్యతిరేకత వ్యక్తమైంది. యుద్ధం ముగింపునకు మరిన్ని చర్చలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.


